డ్రైనేజీ నీటితో కంపు కొడుతున్న కన్యకచెరువు

June 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 14-06-26 నందలూరు మండలంలోని కన్యకచెరువు డ్రైనేజీ నీరు కలిసి దుర్వాసన వెదజల్లుతుంది. చరిత్ర కలిగిన ఈ చెరువు గతంలో ఈనీరుత్రాగేవారు .అంతేకాకుండా కడప జిల్లాలో చేపలకు ప్రసిద్ధి చెందింది అయితే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా కాలా అనుగుణంగా గ్రామము విస్తరించి నివాస గృహాలు అధికమై చెరువును సైతం ఆక్రమించి చెరువుకు వెళ్లే నీటి కాలువలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అంతే కాకుండా చెయ్యేరు, నుండి కన్యకచెరువుకు నీరు వెళ్లేందుకు ప్రధాన కాలువ కూడా నేడు డ్రైనేజీ నీటితో చెత్తాచెదారంతో బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వెళ్లే మార్గంలో కాలువ దుర్గంధం వెదజల్లుతోంది. ఈ సమస్యకు పరిష్కారమే లేదా అని మండల వాసులు, స్థానికులుతీవ్రంగావిమర్శిస్తు న్నారు. బస్టాండ్ పరిసరాలలో ఉన్న చికెన్ అంగళ్లవారు కోడి వ్యర్ధాలను. గతంలో హైవే రోడ్డు మీద వేసేవారు. ప్రస్తుతం చెరువు నీటిలోనే పార వేయడంతో చెరువు నీరు రంగు మారి పశువులు కూడా తాగలేని విధంగా డ్రైనేజీని తలపిస్తు న్నాయి దీంతో హైవేలో వెళ్లే ప్రయాణికులకు, పాదచారులకు దుర్వాసనవెదజల్లుతుంది. పలుమార్లు ఈ విషయాన్ని పత్రికలలో ప్రచురించిన పట్టించుకునే నాధుడే లేడని మండల వాసులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. మండల అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఓవైపు ఆక్రమణ మరోవైపు డ్రైనేజీ నీరు తో కన్యకచెరువు దీనస్థితిలో ఉంది.

🌐 Select Language:
📰 ePaper