శ్రీ శ్రీ శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన రంగు శ్రీనివాస్
జనం న్యూస్ జూన్ 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట:మండలంలోని మైలారం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవస్థాన నూతన కమిటీని సర్పంచ్ నూనె దివ్య తిరుపతి ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్ గా రంగు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు జూలూరి చంద్రశేఖర్, సలహాదారులు సలేంద్ర రవీంద్రచారి, దూదిపాల చంద్రారెడ్డి, నూనె ప్రకాష్, వైస్ చైర్మన్ లు దుదిపాల జోగిరెడ్డి, మామిడిపల్లి సాంబయ్య, కార్యదర్శి దుదిపాల రాంరెడ్డి, కోశాధికారి బత్తిని చిన్న తిరుపతి, కార్యవర్గ సభ్యులు చల్లా భగవాన్ రెడ్డి, నూనె శ్రీనివాస్, పల్లెబోయిన రాజేందర్, నాలికే ఆనందం, మసికే కళ్యాణ్, బొంతల నాగరాజు, దుదిపాల రాజిరెడ్డి, జక్కుల ఐలయ్య, పల్లెబోయిన శ్రీనివాస్, అంబాల సందీప్, ఐలు సురేష్, అబ్బోజు లింగమూర్తి, చల్లా రాజిరెడ్డి, ఆకారపు కుమారస్వామి, గడిపే చంద్రమౌళి, నూనె కిరణ్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన ఛైర్మెన్ శ్రీనివాస్ ను సర్పంచ్, కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చల్లా చక్రపాణి, ఉపసర్పంచ్ మసికే కుమారస్వామి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు…..