కుస్తీ మన అస్తిత్వ ఆస్తి: అనిల్ కుమార్ యాదవ్

జనం న్యూస్ హైదరాబాద్ 09-05-2026 భారతీయ సాంప్రదాయ కుస్తీ పోటీలు తెలంగాణ రాష్ట్రంలోని ల్ బి స్టేడియం లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కుస్తీ పైల్మన్ అనే బిరుదును హైదరాబాద్ లో అరుదైన గౌరవంగా పరిగణిస్తారు. ఈ క్రీడాకే వన్నెతెచ్చిన హైదరాబాద్ లో ఈ పోటీలు జరగడం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను సూచిస్తుంది. (ఆర్గనైజర్స్ పేరులు)వారి ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించే ఈ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కుస్తీ పోటీలు నిర్వహించడం పై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యతు తరాలకు మన ప్రతిభను, స్ఫూర్తిని, పౌరుషాన్ని ప్రదర్శించే విధంగా నిర్వహించిన ఈ పోటీలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అనేకమంది నూతన యోధులను తయారు చేస్తున్న సంస్థలను, గురువులను సభాపతితో కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ప్రతినిధులు, ప్రముఖులు, కుస్తీ యోధులు పాల్గొన్నారు