వివేకానంద నగర్‌లో వాసుదేవ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఐదో శాఖ ప్రారంభం
చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలకు ఆర్థిక బలాన్ని అందించే సంస్థగా ఎదగాలని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆకాంక్ష
జనం న్యూస్ జూన్ 17 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ చేతుల మీదుగా వివేకానంద నగర్ కాలనీలో వాసుదేవ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఐదో బ్రాంచ్ ఘనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని రామకృష్ణ వీధి రోడ్డు చివర ఏర్పాటు చేసిన ఈ కొత్త శాఖను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ, వాసుదేవ్ కో-ఆపరేటివ్ సొసైటీ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా చిన్న వ్యాపారులు, మహిళా సంఘాలు స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించుకునేందుకు అవసరమైన రుణ సౌకర్యాలను ఈ సొసైటీ అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు, వాటిని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే సూచించారు. ప్రజలకు మేలు చేసే దిశగా వాసుదేవ్ కో-ఆపరేటివ్ సొసైటీ సేవలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, కమిటీ సభ్యులు జి. నర్సింగ్ రావు, లక్ష్మీనారాయణ, జి. ప్రసాద్, నాని తదితరులు పాల్గొన్నారు. అలాగే వాసుదేవ్ కో-ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామారావు, శ్రీమయ్య, కె. నాగరాజు, బి. తిరుపతిరావు, డి. వెంకటేశం, కె. వెంకట పద్మావతి, యు. రమాదేవి, మహిళా గ్రూపు లీడర్ మంజులతో పాటు సొసైటీ సభ్యులు, ఉద్యోగులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో పాటు కమిటీ సభ్యులు, వాసుదేవ్ కో-ఆపరేటివ్ సొసైటీ సభ్యులు, ఉద్యోగులను రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వివేకానంద నగర్ ప్రాంత ప్రజలకు మరింత చేరువగా ఆర్థిక సేవలను అందించేందుకు వాసుదేవ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఐదో శాఖ ప్రారంభం కావడం స్థానికంగా హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోంది.