విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకా లు పంపిణీ చేసిన సర్పంచ్ మహేష్ కుమార్

June 17, 2026 | తెలంగాణ

మద్నూర్ జూన్ 17 జనం న్యూస్ ; కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎ క్లారా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను సర్పంచ్ మహేష్ కుమార్ బుధవారం పంపిణీ చేశారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మాట్లాడారు. ఉపాధ్యాయులు ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్యా బోధన చేస్తున్నారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper