గొడ్డల పార్టీ ప్రాపకం కోసం అమర్నాథ్ దిగజారుడు రాజకీయాలు- మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

June 18, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 18 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసి, వ్యక్తిగత దూషణలకు పాల్పడిన మాజీ మంత్రి వైకాపా నాయకుడు గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అమర్నాథ్ ను డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్ రెడ్డి మహిళల పట్ల అవమానకరం మాట్లాడే వాళ్ళని అదుపు చేసి హుందాగా వ్యవహరించేలా చూడవలసిన గొడ్డల పార్టీ అధ్యక్షుడు, వారిని ప్రోత్సహించడo, మందలించవలసిన జగన్ రెడ్డి వారిని ప్రేరేపించడం చూస్తుంటే కులాల కుంపట్లో రేగిలేలా రాజకీయాలు చేయడం తగదని నాగ జగదీష్ జగన్ రెడ్డికి హితువు పలికారు. రాష్ట్రవ్యాప్తంగా అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, మహిళలు ఖండించినప్పటికీ, అమర్నాథ్ ఎటువంటి మార్పు లేదని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని చెప్పడం మహిళల పట్ల అతనికి ఉన్న అభిప్రాయాన్ని తేటతెల్లం చేసి చౌకబార్ రాజకీయాలు చేయడం ద్వారా రాజకీయ విలువలు దిగజారుస్తున్న అమర్నాథ్, తన తండ్రి గుడివాడ గురునాధరావు రాజకీయ చరిత్రలో ఇటువంటి వ్యాఖ్యలు ఏనాడు చేయలేదని, కేవలం సిద్ధాంత పరంగా విమర్శలు చేశారే తప్ప అమర్నాథ్ లాగా దిగజారుడు రాజకీయాలు చేయలేదని నాగ జగదీష్ అన్నారు. సమాజంలో ఒక మహిళ, హోం శాఖ మంత్రిగా ప్రజలు భద్రత కోసం, గంజాయి, సంఘ వ్యతిరేక శక్తులు అదుపు చేయడంలో రికార్డులు సృష్టిస్తున్న అనిత పై కావాలనే తప్పుడు ప్రచారం వ్యక్తి గత దూషణ చేయడం, రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణకు దిగడం వైసిపికే చెల్లిందని నాగ జగదీష్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన క్రైమ్ రేట్ ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1 శాతం తగ్గిందని, దీనికి నిరంతరం కృషి చేసిన అనితను అభినందించ వలసింది పోయి అనిత పై విమర్శలు చేసి సమర్ధించుకోవడం గుడివాడ అమర్నాథ్ కే చెల్లిందని నాగ జగదీష్ మండి పడ్డారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ కాండ్రేగుల రవీంద్ర మల్ల గణేష్ కాండ్రేగుల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు./

🌐 Select Language:
📰 ePaper