బడి తెరిచినా విద్యార్థులకు చేరని పాఠ్యపుస్తకాలు :- పల్లె గ్రీస్మంత్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. 19-06-26నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పాఠశాల లోని విద్యార్థులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందలూరు మండల సీనియర్ నాయకుడు పల్లె గ్రీష్మంత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలలకు నేటికీ పాఠ్యపుస్తకాలు చేరలేదని ఆయనమండిపడ్డారు.విద్యాశాఖ మంత్రి లోకేష్ తన అనుచరులకు, టిడిపి నేతలకు,ఆ పార్టీ సాను భూతిపరులకు సంబంధించిన పాఠ శాలలకు, పుస్తకాలు అమ్ముతూ, వ్యాపారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.రాష్ట్రంలో పుస్తకాలు మరియు యూనిఫారాల విక్రయాలపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ నలు చేస్తామని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఆయన హెచ్చరించారు.