ప్రభుత్వ ఆసుపత్రి పక్కన తవ్విన గుంతలు

June 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 19 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐసి మండలంలో ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యంఅయిజ ప్రభుత్వ ఆసుపత్రి పక్కన అధికారులు తవ్వి వదిలేసిన గుంతల రోగులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన భద్రతా చర్యలు లేకుండా పనులను మధ్యలోనే ఆపేయడం వల్ల అత్యవసర సమయాల్లో వచ్చే రోగుల లకు ఇబ్బందికరంగా మారింది అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వ ఆసుపత్రి పక్కన తవ్విన గుంతలు ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్య ఆస్పత్రి పక్కన తవ్విన గుంతలు.. స్థానికులకు, రోగులకు నిత్యం కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. డ్రైనేజీ లేదా పైప్‌లైన్ పనుల పేరుతో అధికారులు నెలల క్రితం భారీ గుంతలు తవ్వి, ఆ తర్వాత వాటిని పూడ్చడం గానీ, కనీస హెచ్చరిక బోర్డులు పెట్టడం గానీ చేయలేదు. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించడం అత్యంత ప్రమాదకరంగా మారింది. వందలాది మంది గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులు ఈ గుంతల గుండానే ఆసుపత్రికి చేరుకోవాలి. వర్షం పడితే చాలు, ఈ గుంతలు నీటితో నిండిపోయి కనీసం రోడ్డు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అధికారులు మాత్రం కనీసం స్పందించడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper