అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పెబ్బేరు PJP గ్రౌండ్లో ఘనంగా వేడుకలు.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 21 2026 వనపర్తి జిల్లా పెబ్బేరు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని PJP గ్రౌండ్లో యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం వివిధ యోగాసనాలతో ప్రారంభమై సూర్య నమస్కారాలతో ముగిసింది.ఈ సందర్భంగా యోగా శిక్షకులు మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అత్యుత్తమ జీవన విధానమని తెలిపారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నుంచి గంటపాటు యోగా సాధన చేస్తే శరీరం దృఢంగా ఉండటంతో పాటు అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు. యోగాతో పాటు సమతుల ఆహారం, ఆకుకూరలు, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని సూచించారు. భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యానికి మార్గదర్శకంగా నిలుస్తోందని, యోగా మన ఋషులు అందించిన అమూల్యమైన వరమని తెలిపారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు యోగా అలవాటు చేస్తే శారీరక దృఢత్వం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ప్రతి ఇంట్లో యోగా సాధన చేయడం ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతమైన జీవితం గడపగలరని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గొడుగు శాంతన్న, చిన్న రాములు, ఎల్లస్వామి, బాలవర్ధన్, నాగరాజు, నాయక్, వెంకటేష్, చైతన్య, సాయి రెడ్డి, సంతోష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.