పూర్వ విద్యార్థులు తమ ఊరుబడులను కాపాడుకోవాలి.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిడమనూరు నందు 2010-11 విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
జనం న్యూస్: జూన్ 22 నిడమనూరు నల్లగొండ ప్రతినిధి బొంగరాల శ్రీనివాస్ ; తాము చదివిన ఊర్లో ఉన్న బడిలో బడి నేర్పిన విలువలను జీవితంలో కొనసాగించడమే పూర్వ విద్యార్థులు చేయవలసిన పని. తమ గ్రామాల్లో ఇంతకాలం ఉచితంగా విలువైన విద్యను పొందిన బడులు ప్రైవేటీకరణ వల్ల వేలాది రూపాయలు ఖర్చు చేస్తే తప్ప తమ పిల్లలకు చదువు కొనసాగించని స్థితి ఉన్నందున పూర్వ విద్యార్థులు తమ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దోహదపడుతూ కాపాడుకోవాలని పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన కస్తూరి ప్రభాకర్ మరో గ్రంథాల ఉద్యమ నాయకుడు అన్నారు. యువర్ నిడమానురు స్స్కూల్లో జరిగిన 2010-11 బ్యాచ్కు సంబంధించి విద్యార్థులు తాము ఈ పాఠశాలలో పొందిన విద్యా విలువల వల్ల, జీవితంలో నిలబడటం ఆనందంగా జీవితాన్ని కొనసాగించే స్ఫూర్తిని పొందినందుకు విద్యార్థులందరినీ అభినందించారు. అంతర్జాతీయ మానవతా దినోత్సవం, నాన్నల దినోత్సవ సందర్భంగా నాన్నలుగా మారిన పూర్వ విద్యార్థులు తమ పిల్లలకు విలువైన విద్యను అందించడానికి జీవితంలో తమ సహచరులకు తల్లిదండ్రులకు మానవీయంగా చేదోడుగా నిలవడమే కామునిర్చిన విద్యకు నిదర్శనమని అన్నారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్య అనేది విద్యార్థి జీవితమే భవిష్యత్తుకు పునాది. పాఠశాలలు, కళాశాలలు కేవలం పాఠాలు నేర్పే ప్రదేశాలు మాత్రమే కాదు, మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యత మరియు మానవత్వాన్ని పెంపొందించే ఆలయాలు. ఉపాధ్యాయులు గా మా బాధ్యత కేవలం పుస్తక జ్ఞానాన్ని అందించడం మాత్రమే కాదు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కూడా మా కర్తవ్యం. విద్య అనేది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి విజయం తప్పకుండా లభిస్తుందని తెలిపాటు కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యా యులు ప్రభాకర్, మెహరాజ్, అంజయ్య, శ్రీనివాస్ లతోపాటు విద్యార్థులు మహేష్, ప్రియాంక మాధవి, కిరణ్, శివ, సూర్యం, ప్రసాద్, రమేష్, నరసింహా, తేజ తదితరులు పాల్గొన్నారు