4వ తరగతి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ కుమార్

May 11, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 11-05-26 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్ కుమార్ ఎంపికయ్యారు. ఈనెల 9న ఉద్యోగ సంఘం ఎన్నికలు గుంటూరులో నిర్వహించారు. నందలూరు. మండలంలోని పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్ కుమార్ ను ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం ఆనందంగా ఉందన్నారు .4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper