రైతు వేదికలో విత్తన మేళా

June 23, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శిలాంపల్లి రైతు వేదికలో మంగళవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగాప్రభుత్వ నిర్ణయం మేరకు 23.06.2026 నుండి 30.06.2026 వరకు చిలిపిచేడ్ రైతు వేదికలో విత్తన మేళా నిర్వహించడం జరిగింది.ఈ మేళాలో ప్రభుత్వం సూచించిన 7 సన్న రకాల
బి పి టి 5204 ( సాంబ మసూరి)ఆర్ ఎన్ ఆర్ 15048 ( తెలంగాణ సోనా)కె ఎన్ ఎం 1638కే ఎన్ ఎం7715 డబ్ జి.ఎల్ 44 (సిద్ది)
హెచ్ఎంటి జై శ్రీరామ్ వరి విత్తనాలుమరియు ఆరుతడి పంటలపై అవగాహన నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా సబ్సిడీపై మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.రైతులు తమకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను ఒకే చోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. కావున రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తన మేళాలో పాల్గొని తమకు కావలసిన విత్తనాలను కొనుగోలు చేసుకోవలసిందిగా కోరడమైనది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ గౌడ్, ఏఈవోలు వంశీ , కృష్ణవేణి రైతులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper