రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన రాచూరి మురళి

June 23, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 23-06-26 భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ సూచనల మేరకు ఈ రోజున నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి విశాఖపట్నం నందు గల సౌత్ కోస్ట్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ వై బాలాజీ కిరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి నందలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి గురించి మరియు నందలూరు రైల్వే స్టేషన్ లో రైళ్ల నిలుపుదల గురించి కోరడం జరిగినది ఇందుకుగాను నందలూరు రైల్వే స్టేషన్ ను అన్ని విధాల రాబోవు రోజులలో అభివృద్ధి పథంలో నడపడానికి రైల్వే అధికారులు హామీ ఇవ్వ డం జరిగినది వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ ను 12797-12798 ను ఒక వారం లోపల నంద లూరులో స్థాపేజీ ఇస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే మరియు సౌత్ కొస్ట్ రైల్వే అత్యున్నత మీటింగ్ సమావేశంలో మాట్లాడడం జరిగినదని తెలపడం జరిగినది మరియు రాబోవు రోజులలో మరికొన్ని రైళ్ల నిలుపుదలకు ప్రతిపాదనలు కచ్చితంగా తెస్తామని హామీ ఇవ్వడం జరిగినది ఇందుకు గాను రాచూరి మురళి సౌత్ కోస్ట్ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ వై బాలాజీ కిరణ్ కి కృతజ్ఞతలు తెలపడం జరిగినది మరియు రాచూరి మురళి మాట్లాడుతూ వెంకటాద్రి త్వరలో నిలుపుదల లో సందర్భంలో ప్రతి ఒక్క నందలూరు పౌరులు రైల్వే కు టికెట్ కొనుక్కుని ప్రయాణం చేసి అర్నింగ్స్ పెంచడం వలన మిగిలిన రైళ్ల నిలుపుదల కచ్చితంగా నందలూరులో ఉంటుందని నందలూరు మండల ప్రజలను శిరస్సు వంచి కోరడమైనది.

🌐 Select Language:
📰 ePaper