మక్క కొనుగోలు వ్యవహారంపై విచారణ చేపట్టాలని రైతుల డిమాండ్

June 24, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 23: శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం : కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రం ద్వారా రైతుల నుంచి సేకరించిన మక్కలను మార్కెఫెడ్ గోదాములకు తరలించిన అనంతరం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతు వేదికలో మీడియా సమావేశం నిర్వహించి తమ సమస్యలను వెల్లడించారు.రైతుల కథనం ప్రకారం, కొనుగోలు కేంద్రం నుంచి నేరుగా ప్రైవేటు మిల్లులకు తరలించిన మక్కకు సంబంధించి పూర్తి మొత్తాలు రైతుల ఖాతాల్లో జమ కాగా, మార్క్ఫెడ్ గోదాములకు తరలించిన మక్కకు మాత్రం తక్కువ మొత్తాలు జమయ్యాయని ఆరోపించారు. దీంతో చెల్లింపుల్లో వ్యత్యాసం ఎందుకు వచ్చిందనే దానిపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు వేదిక లో విత్తన మేళా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకు రైతులు తమ గోడును వినిపించినప్పటికీ, సమస్యపై స్పష్టమైన హామీ లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, మార్కెఫెడ్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి రైతులకు రావాల్సిన పూర్తి బకాయిలను వెంటనే చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు గానుగుల నాగరాజు, నీల రవీందర్ రెడ్డి, అబ్బు రవీందర్ రెడ్డి, కోలా ఆనందం, కె రాజేశ్వరరావు, ఏ రాజేశ్వరరావు, నర్సీఎ “రెడ్డి, కుసుంబ రాజు, గాజె రాజేందర్ తదితరులు పాల్గొన్నారు….

🌐 Select Language:
📰 ePaper