కేతి బచావో అభియాన్ కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 25 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లా చిలిపిచేడు మండలంలోని బండ పోతుగల్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం తునికి వ్యవసాయ శాఖ మెదక్ జిల్లా వారి ఆధ్వర్యంలో బండపోతుగల్ గ్రామంలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సోదరులకు భూమి యొక్క ఆరోగ్యం గురించి వివరించడం జరిగింది. కేవలం రసాయనిక ఎరువులు మీద ఆధారపడి పోషక యాజమాన్య పద్ధతులు చేయడం వలన భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుందని వివరిస్తూ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతిలో భాగంగా పచ్చి రొట్టె పైర్లని సాగు చేసి భూమీల్లో కలియ దున్నడం వరి కోయకాలను కాల్చకుండా భూమిలోనే కలియదున్నతూ అలాగే జీవన ఎరువులు మరియు సూక్ష్మ పోషకాలు కూడా సమపాలల్లో వాడుతూ భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ రైతులు అధిక దిగుబడులు పొందాలని సూచించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయం గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది. రైతు సోదరులు యూరియాని సరైన మోతాదులో వాడుతూ నానో యూరియా, నానో డిఏపి కూడా వాడి మంచి లాభాలు పొందవచ్చని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎస్. డి. నల్కర్ గారు, సీనియర్ సైంటిస్ట్ ఇన్ హెడ్, డాక్టర్ ఎన్ ప్రతాపరెడ్డి సైంటిస్ట్ కెవికె తునికి, రాజశేఖర్ గౌడ్ మండల వ్యవసాయ అధికారి మరియు ప్రవీణ్ రెడ్డి సర్పంచ్ బండపోతుగల్ అలాగే రైతు సోదరులు కూడా పాల్గొనడం జరిగింది