ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బిజెపి సీనియర్ నేతలు

June 26, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూన్ 26( ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అ:అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన భారతీయ జనతా పార్టీ (BJP) సీనియర్ నాయకులు యళ్ల దొరబాబు, మోకా వెంకట సుబ్బారావులు ఎమ్మెల్యే ఆనందరావును కలిసి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం, అమలాపురం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆనందరావు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, కూటమి ప్రభుత్వ నేతృత్వంలో నియోజకవర్గం మరిన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper