జువ్వాడి నరసింహారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన వేములకుర్తి సర్పంచ్ తరి రామానుజం
జనం న్యూస్, జులై 4, జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం: ఇబ్రహీంపట్నం మండలంలోని వేములకుర్తి గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నరసింహారావు జన్మదిన వేడుకలను గ్రామ సర్పంచ్ తరి రామానుజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి జువ్వాడి నరసింహారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ తరి రామానుజం మాట్లాడుతూ, ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే నాయకుడి గా జువ్వాడి నరసింహారావు గుర్తింపు పొందారని కొనియాడారు.”జనంతో కలిసి తిరిగే వ్యక్తిత్వం, జనంతోనే ఉండే నాయకత్వం, ప్రతి కార్యకర్తను తన కుటుంబ సభ్యునిగా భావించే గొప్ప మనస్తత్వం జువ్వాడి నరసింహారావు సొంతం” అని ఆయన పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా విశేష ఆదరణ పొందుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా జువ్వాడి నరసింహారావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ ప్రజలు పెంట లింబాద్రి, నాంపల్లి వెంకటాద్రి,అంకతి రాజన్న,పుప్పాల నగేష్, నరేందర్, ఎడిపల్లి గంగారెడ్డి,దొనకేన రాజేష్, గుమ్మాల గంగన్న, గుమ్మల రమేష్, పట్నం నవీన్, కొత్తూరు నరేష్, సుధాకర్ గంగాధర్,దేవేందర్, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు