వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా ఘన నివాళులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

July 4, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 4 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : వంగవీటి మోహన్ రంగా 79వ జయంతి సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ హౌసింగ్ బోర్డు టెంపుల్ బస్‌స్టాండ్ సమీపంలో కూకట్‌పల్లి కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్‌పల్లి జనసేన పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని, ప్రజలకు స్వయంగా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ, వంగవీటి మోహన్ రంగా ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయాలను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, వంగవీటి రంగా అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కాపు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

🌐 Select Language:
📰 ePaper