మహిళల పై నేరాల నివారణకు అవగాహన కార్యక్రమం..

July 8, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్, జూలై 08,అచ్యుతాపురం: అచ్యుతాపురం సెజ్ పరిధిలో ఉన్న బ్రాండిక్స్ యూనిట్ 2లోమహిళల రక్షణ కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.సుమారు 1000 మంది మహిళా ఉద్యోగులు హాజరైన ఈ కార్యక్రమంలోగృహ హింస, పని ప్రదేశంలో వేధింపులు, సైబర్ నేరాలు, అలాగే తమ మైనర్ పిల్లల పట్ల జాగ్రత్త వహించడం గురించి వారికి అవగాహన కల్పించారు. వివిధ చట్టాల క్రింద ఉన్న సంబంధిత నిబంధనల గురించి కూడా వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ, స్థానిక సీఐ చంద్రశేఖర రావు అచ్యుతాపురం ఎంపీడీఓ, తహసీల్దార్,ఎస్ఐ సుధాకర్, డబ్ల్యూఎస్ఐ పోషణ పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper