ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
జనం న్యూస్ నందలూరుకడప జిల్లానందలూరు: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజల హృదయాల్లోంచి ఎవరూ చెరపలేరని ఎంపీపీ మేడ విజయభాస్కర్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి లు పేర్కొ న్నారు. బుధవారం మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు పల్లె మాధవి అధ్యక్షతన డాక్టర్ వైయస్సార్77వజయంతిని పురస్కరించుకొని స్థానిక బస్టాండ్ కూడలిలోని వైయస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలను వేశారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజల హృదయాల్లో చిరస్మరణీ యంగా నిలిచి పోయారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్య క్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు గొబ్బిళ్ళ త్రినాధ్, అరిగెల సౌమిత్రి, గుండు మల్లికార్జున రెడ్డి, గీతాల నరసింహా రెడ్డి, నడివీధి సుధాకర్, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇబ్బు, గుణ యాదవ్, అజీజ్, భాస్కర్ యాదవ్, తుమ్మల శ్రీధర్, నరసారెడ్డి, షేక్ షావల్లి, మోహన్ రెడ్డి, కసిరెడ్డి గంగిరెడ్డి, హస్తవారం సుబ్బారామిరెడ్డి, విజే యుడు,నాగేశ్వర రెడ్డి, నవాబ్, ఖలీం, గంగి నాయుడు,మోడపుతుల సుధాకర్, ఉమ్మడి శెట్టి సుధాకర్, మోదుగుల చంద్రశేఖర్, ఎముక దుర్గయ్య, శ్రీనివాసరాజు, అరిగెల నాని, తదితరులు పాల్గొన్నారు.