బండి కుమారుడు భగీరథ్ లొంగిపోవాలి జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్

May 13, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మే 13 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో (POCSO) కేసులో భగీరధ తక్షణమే పోలీసులకు లొంగిపోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికపై లైంగిక దాడి ఆరోపణలతో బండి భగీరథ,పై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో పరారీలో ఉన్న ఆయన తక్షణమే లొంగిపోవాలని అన్నారు. ఈ కేసులో పోలీసుల విచారణ ఆలస్యం కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తక్షణమే దర్యాప్తు వేగవంతం చేయాలని డీజీపీ సీవీ ఆనంద్‌,ను ఆదేశించారన్నారు. రాజకీయ ఒత్తిళ్లు లేవనడానికి ప్రజా ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందనడానికి కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి మహిళ ఐ పీ ఎస్ పర్యవేక్షణలో కొనసాగాలని ఆదేశాలు జారీ చేయడమే నిదర్శనమన్నారు. బండి భగీరథ్, గతంలో విద్యాసంస్థల్లో ర్యాగింగ్ చేస్తూ దాడులకు పాల్పడ్డాడన్నారు. ఇకనైనా ఆయన తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలన్నారు.

📰 ePaper