ఎస్ఐఆర్ పత్రాల ఫిల్లింగ్ ప్రక్రియను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి

July 14, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జులై 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బాలానగర్ డివిజన్ పరిధిలోని పలు బస్తీలు, కాలనీలలో నిర్వహిస్తున్న ఓటరు వెరిఫికేషన్, పత్రాల ఫిల్లింగ్ ప్రక్రియను బాలానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు తో కలిసి వెరిఫికేషన్ ప్రక్రియను సమీక్షించారు. ఓటర్లకు అవసరమైన సూచనలు అందిస్తూ, తమ వివరాలను సక్రమంగా ధృవీకరించుకుని అవసరమైన పత్రాలను పూర్తిగా సమర్పించాలని అవగాహన కల్పించారు.అలాగే ఫారం నింపే ప్రక్రియ పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడేలా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు కావడం ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎంతో ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు బూత్ లెవల్ అధికారులు కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper