వెల్లుల్ల మసాపేటలో భూభారతి–భూసర్వే అవగాహన కార్యక్రమం విజయవంతం

July 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జులై 17, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల మసాపేట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూభారతి–భూసర్వే అవగాహన కార్యక్రమం గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూడూరు తిరుపతి మాట్లాడుతూ, రైతులు భూసర్వే కార్యక్రమానికి పూర్తిస్థాయిలో సహకరించి తమ భూముల హద్దులను ఖచ్చితంగా చూపించాలని కోరారు. ఈ సర్వే ద్వారా భూ రికార్డులు పారదర్శకంగా రూపొందడంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలకు చెక్ పడుతుందని తెలిపారు.కార్యక్రమంలో మెట్‌పల్లి తహసీల్దార్ నీత మేడం పాల్గొని భూసర్వే ప్రక్రియ, ప్రభుత్వ మార్గదర్శకాలు, రైతులు పాటించాల్సిన సూచనలను వివరించారు.ఈ కార్యక్రమంలో ఏడీ సర్వేయర్ కిషన్, ఆర్‌ఐ సంధ్యారాణి, సర్వేయర్ గంగా నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి నారాయణ, జీపీఓ రాజేశం, ఉపసర్పంచ్ శేఖర్, వార్డు సభ్యుడు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.గ్రామ పాలకవర్గ సభ్యులు, రైతులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భూభారతి–భూసర్వే అవగాహన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🌐 Select Language:
📰 ePaper