మునగాల మోడల్ స్కూల్ లో బడిబాట
(జనం న్యూస్-మే 14- కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్)- మునగాల మోడల్ స్కూల్,కళాశాలలో గురువారం బడిబాట నిర్వహించారు.పాఠశాల పనితీరుపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఈ విద్యా సంవత్సరం పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో 99% విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్ బి.సైదయ్య గౌడ్ తెలిపారు.టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎంపీసీ, బైపిసి,సిఇసి,ఏసీఈ కోర్సులకు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని,విద్యార్థినులకు ఉచిత హాస్టల్ వసతి కలదని ఆయన సూచించారు.