కుదేలైన ఆక్వా రంగం దిక్కు తోచని స్థితిలో రైతాంగంఆక్వా రైతుల సమస్యలపై భారీ నిరసన: జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పణ

జనం న్యూస్ మే 14 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హైస్కూల్ సెంటర్, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరl కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ,అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన,అమలాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ నేతృవంలో నిరసన అనంతరం *అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారి కి వినతిపత్రం అందజేసిన జిల్లా నాయకులు ,అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రంగం పూర్తిగా కుదిరిపోయింది అని, ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అలాగే ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బందులు పడుతున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటు గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారని ఆయనఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వ వైఫల్యాలపై నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా యూనిట్‌కు రూ.1.50 పైసలకే విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని అన్నారు. అలాగే మేత (ఫీడ్) ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమవడంతో టన్నుకు సుమారు రూ.10 వేల వరకు అదనపు భారం పడుతోందని చెప్పారు.అదేవిధంగా సిండికేట్ల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల సాగు ఖర్చులు పెరిగి రొయ్యల ధరలు తగ్గడంతో రైతులకు నష్టాలు వస్తున్నాయని జగ్గిరెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో రైతులకు అండగా ఉన్న ఏపీఎస్డిఏ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.ఆందోళన అనంతరం నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి ఆక్వా రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఈ మేర వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి జక్కంపూడి విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పితాని బాలకృష్ణ, ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు పొన్నాడ సతీష్ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్య నారాయణరావు.బొమ్మి ఇజ్రాయిల్. వైసిపి రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు. నియోజకవర్గాల ఇన్చార్జిలు గన్నవరపు సూర్యనారాయణ రావు. పాముల రాజేశ్వరి దేవి. గొల్లపల్లి సూర్యారావు. గొల్లపల్లి డేవిడ్, ఒంటెద్దు వెంకన్న నాయుడు. కంఠం శెట్టి ఆదిత్య. కుడుపూడి భరత్ భూషణ్ వైసిపి నాయకులు నడింపల్లి సూరిబాబు రాజు దొరబాబు ,నేల కిషోర, తదితరులు పాల్గొన్నారు.