మట్టిలో మాణిక్యం
జనం న్యూస్06/08/2026 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మారుమూల ప్రాంతమైనటువంటి ఆజంనగర్ గ్రామంలో పుట్టిపెరిగి దేశం గర్వించేలా భారత అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగం సంపాదించినటువంటి కోరవేన శ్రీనాథ్ కు ప్రశంసల జల్లు కురుస్తుంది నేడు గ్రామానికి చెందినటువంటి మాంతు సుభాష్.. జాడి శ్రీనివాస్.. తులిసే గారి రవి.. నవునూరి మహేష్ శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ క్రమంగా సుభాష్ మాట్లాడుతూ నా మిత్రుడైన కోరవేనా అశోక్ కుమారుడు శ్రీనాథ్ ఇంత గొప్ప ఉద్యోగం సాధించడం నాకు ఎంతో గర్వకారణమని తెలిపారు ఇలాంటి సంతోషకరమైన వార్తను మా ఊరు నుండి విన్నందుకు ప్రశంస ఉందని జాడి శ్రీనివాస్ తెలిపారు