సామ రామ్ మోహన్ రెడ్డికి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలి: చిరుమర్తి రాజు
జనం న్యూస్, ఆగస్టు 7 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్ మోహన్ రెడ్డికి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకుడు చిరుమర్తి రాజు కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ తరఫున మీడియా అండ్ కమ్యూనికేషన్ విభాగంలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సామ రామ్ మోహన్ రెడ్డి సమర్థవంతంగా వ్యవహరిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. తనదైన శైలిలో ప్రత్యర్థి పార్టీల విమర్శలకు సమాధానాలు ఇస్తూ పార్టీకి మంచి గుర్తింపు తీసుకువచ్చారని అన్నారు.యువతకు ప్రాధాన్యత ఇవ్వాలంటే సామర్థ్యం, చురుకుదనం కలిగిన యువ నాయకులను ప్రోత్సహించాలని, అందులో భాగంగా సామ రామ్ మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించడం ద్వారా పార్టీ మరింత బలోపేతం అవుతుందని చిరుమర్తి రాజు అభిప్రాయపడ్డారు.కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు సముచిత గుర్తింపు లభించాలంటే సామ రామ్ మోహన్ రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు.