జిల్లా పోలీసుల సంఘం జాయింట్ సెక్రటరీ సత్యనారాయణకు ఘన సన్మానం
జనం న్యూస్, ఆగస్టు 10, జగిత్యాల జిల్లా : మెట్పల్లి :జిల్లా పోలీసుల సంఘం జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణను మెట్పల్లి పట్టణంలో అధ్యాపకులు, అభిమానులు, స్నేహితులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించి, మిఠాయిలు పంచుకుని అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా అధ్యాపకులు గద్దె ప్రభాకర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి చెందిన సత్యనారాయణ వ్యవసాయ దినసరి కూలీ పనులు చేస్తూనే చదువుపై శ్రద్ధ చూపుతూ, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తించి నేడు జిల్లా స్థాయి పోలీసుల సంఘం జాయింట్ సెక్రటరీగా ఎదగడం అభినందనీయమన్నారు. కష్టపడి, పట్టుదలతో ముందుకు సాగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సత్యనారాయణ నిరూపించారని పేర్కొన్నారు.తన స్వగ్రామమైన రంగారావుపేట గ్రామం నుంచి జిల్లా స్థాయి పోలీసుల సంఘం బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదగడం గ్రామ ప్రజలకు, యువతకు గర్వకారణమన్నారు. భవిష్యత్లో సత్యనారాయణ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ప్రస్తుత యువత చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉండి సత్యనారాయణను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కష్టపడి చదువుకుని, తమకు నచ్చిన రంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో పిప్పరి నరేందర్, పుప్పాల నవీన్, రమేష్, ప్రకాష్ తదితరులు పాల్గొని సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. అనంతరం మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.