హెచ్ఐవి నివారణ అందరి బాధ్యత
జనం న్యూస్ ఆగస్టు 12 బీబీపేట మండలం కామారెడ్డి జిల్లా ఉమ్మడి మండలం దోమకొండ మండల్ కొత్తగా ఏర్పడ్డ బీబీపేట్ మండలం కు చెందిన బాలకృష్ణ హెచ్ఐవి నివారణ మన అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐ ఐ ఈ సీ( ఇంటెన్షఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ – తీవ్రతర మైన విజ్ఞాన సమాచారం- అవగాహన ) కార్యక్రమాన్ని డి ఎం హెచ్ ఓ తో పాటు ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం హెచ్ ఐ వి ఎయిడ్స్ నివారణలో భాగంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.రెండు నెలల పాటు వివిధ కేంద్రాలు గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. అనంతరం హెచ్ ఐ వి ప్రమాదకర పరిస్థితిని తెలుసుకునేందుకు గాను క్యూ ఆర్ కోడ్ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రమాదకర వ్యక్తులు క్యూఆర్ కోడ్ పోస్టర్లను సద్వినియోగం చేసుకుని, సేవలను పొందాలని కోరారు. అవసరమైతే 1097 కి డయల్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమం లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ ఎం ఓ రవీందర్ గౌడ్, హెచ్ ఐ వి నివారణ జిల్లా అధికారి ప్రదీప్ కుమార్, ఏ ఆర్ టి వైద్యులు స్నేహా, ఆంచల్, వై ఆర్ జి కేర్ ఉమ్మడి జిల్లా డీ ఆర్పీ గర్దాస్ సుధాకర్, కౌన్సిలర్లు మేక నాగరాజు, మిరుదొడ్డి శేఖర్, పాముల లలిత కుమారి, మెహరాజ్, చిరంజీవి, ప్రవీణ్ గౌడ్, ఎస్ ఎస్ కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్, వివిధ స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.