నందలూరు లో అంబరాన్ని అంటిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
సబ్ టైటిల్ :-350 అడుగుల జాతీయ త్రివర్ణ పతకం తో విద్యార్థుల భారీ ర్యాలీ
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా ఈ రోజున నందలూరు మండలంలో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులచే 80వ స్వాతంత్ర దినోత్సవంను పురస్కరించుకొని హర్ ఘర్ తిరంగా వేడుకలను 360 అడుగుల త్రివర్ణ పతాకముతో ర్యాలీగా ఘనముగా నిర్వహించడం జరిగినది ఈ యొక్క వేడుకలలో విద్యార్థులు జాతీయ గీతాలను మరియు జాతీయ నినాదాలను హోరెత్తించడం జరిగినది మరియు హర్ తిరంగా కార్యక్రమం నిర్వాహకులు రాచూరి మురళి, వీరబల్లి జయ కుమార్ రెడ్డి, ఆండ్ర శివారెడ్డి,చుక్కా శ్రీనివాసులు, హఠాన్ మెహర్ ఖాన్, తిరుపతి వెంకటరమణ గార్లు మాట్లాడుతూ నందలూరు మండలం పాఠశాల యాజమాన్యానికి, విద్యార్థినీ విద్యార్థులకు, పోలీసు శాఖ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలపడం జరిగినది.