ఐ. పోలవరం మండలంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ సైకిల్ ర్యాలీ

August 14, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలంలో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఐ. పోలవరం మండల ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీలో జాతీయ జెండాలను చేతబూని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి గారు, ఐ. పోలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సాగిరాజు సూరిబాబు రాజు గారు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ చెల్లి అశోక్ గారు శ్రీ కాకర్లపూడి రాజేష్ గారు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. జాతీయ జెండాలను చేతబూని దేశభక్తిని చాటుతూ నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీ మండలంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని నెలకొల్పింది. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ సమైక్యత, సమగ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

🌐 Select Language:
📰 ePaper