జగన్నాథపురం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్టీల్ ప్లేట్లు అందజేసిన గర్నెపూడి సునీత

August 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు. 17 పేద విద్యార్థుల సంక్షేమం, శ్రేయస్సు కోరడంలోనే ఉపాధ్యాయ వృత్తికి సార్థకత లభిస్తుందని హెచ్‌ఎం కశ్శెట్టి జగన్‌బాబు తెలిపారు. తర్లుపాడు మండలం జగన్నాథపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 52 మంది విద్యార్థులకు గర్నెపూడి సునీత ఉచితంగా స్టీల్ భోజనం ప్లేట్లను అందజేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జగన్‌బాబు మాట్లాడుతూ సుమారు 4,200 విలువగల స్టీల్ ప్లేట్లను ఉచితంగా అందించడం అభినందనీయమని కొనియాడారు.సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో సామాజిక సేవను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.సంపాదనలో కొంత భాగాన్ని పేద విద్యార్థులు, సమాజ శ్రేయస్సు కోసం వెచ్చిస్తే ఎంతో ఆత్మతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఎం. అనూషతో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper