ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం

August 19, 2026 | తెలంగాణ

మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్


జనం న్యూస్ 20ఆగష్టు పెగడపల్లి రేవంత్ రెడ్డి తెలంగాణప్రజాప్రభుత్వంలోతెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ పాదనలతోనంచర్ల గ్రామానికి చెందిన చేని వెంకటరమణ వెంకటి దంపతులకు మంజూరైనఇందిరమ్మ ఇంటికి ఈరోజు స్లాబ్ నిర్మాణం చేయడానికి స్థానిక సర్పంచ్ కుంటాల వనజ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించిన పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ .అనంతరం రాములు గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం వరం లాంటిదని అన్నారు తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మొదటిదాఫాలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు తెలంగాణ సర్కార్ మంజూరు చేసిందని అదేవిధంగా రెండో విడతలో నియోజకవర్గానికి రెండు వేల ఇండ్లు మంజూరు అయ్యాయని అలాంటి ఇండ్లను మంజూరు చేయడానికి అన్ని గ్రామాలలో గుడిసెలలో నివసిస్తున్న పేదలను సంబంధిత అధికారులు గుర్తిస్తున్నారని తెలిపారు.అనంతరం మిగతా పేదవారిని గుర్తించి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ సహకారంతో రెండో విడత ఇల్లను కూడా జూరు చేస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ ఎడ్ల శ్యామ్ సుందర్ రెడ్డిపంచాయతీ కార్యదర్శి పద్మవార్డ్ సభ్యులు మేక రాయమల్లు అక్కేం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper