అమరవీరుల త్యాగాలను భావితరాలకు చాటేలా స్థూపం నిర్మాణం – ప్రభుత్వ విప్

August 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 19 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు పట్టణ కేంద్రంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను చిరస్మరణీయంగా నిలిపేలా తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణానికి *తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య బుధవారం రోజున రైల్వే అండర్ పాస్ దగ్గర శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో యువకులు, విద్యార్థులు, ఉద్యమకారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, వారి త్యాగాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మరచిపోకుండా, వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సి న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆలేరు పట్టణంలోని అండర్‌పాస్ చౌరస్తాకు “తెలంగాణ అమరవీరుల చౌరస్తా”గా నామకరణం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. ఈ ప్రాంతంలో నిర్మించనున్న అమరవీరుల స్థూపం ఆలేరు పట్టణానికి ప్రత్యేక గుర్తింపుగా నిలవడంతో పాటు, తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అఖిలపక్ష నాయకులు కార్యకర్తలు, అమరవీరుల కుటుంబ సభ్యులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper