అమెరికా పర్యటనకు బయలుదేరుతున్న జి. నర్సింగరావు దంపతులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆశీస్సులు

August 19, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి అమెరికా పర్యటనకు బయలుదేరుతున్న రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు జి. నర్సింగరావు దంపతులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి, వారి విదేశీ పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. నర్సింగరావు దంపతుల కుమార్తె వివాహం ఆగస్టు 30న అమెరికాలో జరగనున్న నేపథ్యంలో, వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. కాబోయే నూతన వధూవరులకు తన ఆశీస్సులు అందజేసి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకున్నారు.అదేవిధంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నర్సింగరావు కుమార్తె వివాహ వేడుకలు అమెరికాలో ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని నర్సింగరావు దంపతులు స్వదేశానికి క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జనంపల్లి పురేందర్ రెడ్డి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper