రేణిగుంట గంగమ్మ తల్లి జాతరలో ఘనంగా ప్రత్యేక పూజలు.అమ్మవారిని దర్శించుకున్న పీజీ రెడ్డి ఓం స్టే అధినేత గంగిరెడ్డి

August 19, 2026 | తెలంగాణ

జనం న్యూస్, ఆగస్టు 19, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి:రేణిగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీజీరెడ్డి ఓం స్టే అధినేత గంగిరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.శ్రావణమాసాన్ని పురస్కరించుకుని గంగమ్మ తల్లికి ఆలయ నిర్వాహకులు, గ్రామ ప్రజలు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొనాలని అమ్మవారిని వేడుకున్నట్లు గంగిరెడ్డి తెలిపారు.జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి, మునీశ్వర్ రావు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper