రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు

August 20, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భారతదేశ యువత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ని స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు గురువారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఐటీ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ అని అన్నారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అని వెల్లడించారు. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేసినవారు రాజీవ్ గాంధీ అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సదర్ లాల్ సతీష్ లక్ష్మణరావు నాయకులు చల్లా చక్రపాణి చిందం రవి , వైనాల కుమారస్వామి నిమ్మల రమేష్ కొమ్ముల భాస్కర్ బసాని ప్రకాష్ మారపల్లి కటయ్య వరదరాజు సుదర్శన్ దామెరకొండ కొమురయ్య బసాని మార్కండేయ, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper