పరిసరాల పరిశుభ్రతే ధ్యేయం.

August 28, 2026 | తెలంగాణ

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఆగష్టు 28-08-2026 శుక్రవారం ‘డ్రై డే-ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, కమిషనర్ గణేష్, స్థానిక కౌన్సిలర్ పర్వీన్ షకీల్ పాల్గొన్నారు. వార్డు వీధుల్లో పర్యటించి ఇంటింటికీ తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు.ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ఇళ్ల వద్ద నిల్వ ఉన్న నీటిని పారబోసి, కూలర్లు, పాత టైర్లు, తొట్టెలు, డబ్బాలను శుభ్రం చేయించారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు (ప్రతి శుక్రవారం) తప్పనిసరిగా ‘డ్రై డే’గా పాటించి ఇళ్లలోని నీటి పాత్రలను శుభ్రం చేసుకొని ఎండబెట్టాలని కోరారు._కమిషనర్ గణేష్ మాట్లాడుతూ.దోమల ఉత్పత్తిని అరికట్టడంలో మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత కీలకమని తెలిపారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్ వాహనాలకే అందించాలన్నారు.వార్డు కౌన్సిలర్ పర్వీన్ షకీల్ మాట్లాడుతూ.వార్డు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper