కరెన్సీ నోట్లతో భగీరథి అమ్మవారికి అలంకరణ
జనం న్యూస్, ఆగష్టు 28,అచ్యుతాపురం:శ్రావణమాసం 3వ శుక్రవారం సందర్భంగా అచ్యు తాపురం మండలం హరిపాలెం–అందలాపల్లి గ్రామంలో శారదా నది ప్రవాహం పరిసర ప్రాంతాల్లోని అందలాపల్లి కొండపై కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ భగీరథి అమ్మవారిని రూ.1,00,001 విలువైన కరెన్సీ నోట్లతో అత్యంత వైభవంగా అలంకరించారు. పుష్పాలు, పండ్లు, దీపాలు మరియు వివిధ రకాల అలంకరణలతో అమ్మవారి సన్నిధి భక్తి శోభతో కళకళలాడుతోంది.హరిపాలెం,అందలాపల్లి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి భగీరథి అమ్మవారి దివ్య దర్శనం చేసుకున్నారు.అమ్మవారి కృపాకటాక్షాలతో భక్తులందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు, సకల శుభాలు కలగాలని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.