ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సామాజిక బాధ్యత పై అవగాహన అవసరంసైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, ఐపీఎస్

August 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగస్టు 29 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు సమాజం పట్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, ఐపీఎస్ అన్నారు. శారీరక దృఢత్వం, సేవాభావం, సమాజ శ్రేయస్సు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.రోహిణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యన్ ఎం డి సి హైదరాబాద్ మర్తోన్ 2026లో భాగంగా చేపట్టిన ఐదు కిలోమీటర్ల రన్ విజయవంతంగా ముగిసింది. హెచ్ ఐ సీ సీ నుంచి హైటెక్స్ వరకు సాగిన ఈ పరుగు కార్యక్రమంలో సుమారు 6,100 మంది రన్నర్లు, విద్యార్థులు, యువత, సామాన్య ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రన్ ఫర్ ఏ కేస్ అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు సామాజిక సేవలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేలా సాగింది.భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నప్పటికీ నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంపై దృష్టి పెట్టాలని సూచించారు. క్రమం తప్పకుండా పరుగు, నడక వంటి వ్యాయామాలను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. శారీరక ఆరోగ్యంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావడం ద్వారా సేవాభావం మరింత బలపడు తుందని అన్నారు.సెల్‌ఫోన్‌కు దూరంగా.. పుస్తక పఠనానికి దగ్గరగాపిల్లలు సెల్‌ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయించడా పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని సీపీ సూచించారు. “సెల్‌ఫోన్ వద్దు – పుస్తకమే ముద్దు” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. కథల పుస్తకాలు, ఇతర పుస్తకాలు, రాత సామగ్రిని అవసరమైన పిల్లలకు అందించడం ద్వారా వారిలో పఠనాసక్తిని పెంచడంతో పాటు జ్ఞానాన్ని విస్తరించేందుకు దోహదపడుతుందని తెలిపారు.
చిన్న సహకారం.. పెద్ద మార్పురోహిణి ఫౌండేషన్ చేపట్టిన పవర్ ఆఫ్100” కార్యక్రమం సమాజానికి మంచి సందేశాన్ని అందించిందని సీపీ పేర్కొన్నారు. “100 పీపుల్స్ రుపయలు 100 ఈచ్ వన్ పవర్ ఫుల్ చేంజ్ అనే ఆలోచనతో ప్రతి ఒక్కరి చిన్న సహకారం కూడా సమాజంలో పెద్ద సానుకూల మార్పుకు బాటలు వేయగలదని వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా సామాజిక బాధ్యత, సమిష్టి భాగస్వామ్యం, సేవాభావాన్ని ప్రజల్లో పెంపొందించేందుకు నిర్వాహకులు చేసిన కృషిని ఆయన అభినందించారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన రోహిణి ఫౌండేషన్ నిర్వాహకులు, ఎన్.ఎం.డి.సి హైదరాబాద్ మర్తున్ నిర్వాహకులు, రన్నర్లు, విద్యార్థులు, ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బందికి సైబరాబాద్ పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper