మట్టి వినాయకుడే ముద్దు.. పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత!

August 29, 2026 | వైరల్ వార్తలు

బిచ్కుంద ఎస్సై జి. రాజుకు వినతిపత్రం..ఎంఆర్‌ఓ, ఎంపీడీఓతో పాటు ఇతర పరిపాలనా కార్యాలయాలకు సీసీఆర్ ప్రతినిధి సుశీల్ కుమార్ వినతి

బిచ్కుంద ఆగస్టు 29 జనం న్యూస్ కామారెడ్డి బిచ్కుంద:రానున్న వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరుతూ సీసీఆర్ కామారెడ్డి ప్రతినిధి సభ్యుడు సుశీల్ కుమార్ సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.ఈ మేరకు బిచ్కుంద ఎస్‌ఐ జి. రాజుకు వినతిపత్రం అందజేసి, గ్రామాల్లో ఏర్పాటు చేసే వినాయక మండపాల నిర్వాహకులకు ముందస్తుగా పర్యావరణహిత విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించాలని కోరారు. అలాగే ఎంఆర్‌ఓ, ఎంపీడీఓతో పాటు ఇతర పరిపాలనా కార్యాలయాలకు కూడా వినతిపత్రాలు సమర్పించారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరుల్లో కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని సుశీల్ కుమార్ పేర్కొన్నారు. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని, నీటి వనరులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని కోరారు.గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ‘పర్యావరణ పరిరక్షణ – మనందరి బాధ్యత’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.భక్తి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూనే పర్యావరణహితంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సీసీఆర్ తరఫున అధికారులను కోరినట్లు సుశీల్ కుమార్ తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper