రైతు బీమాపై మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం

August 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ ఆగష్టు 29 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి ఈరోజు విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ కలిసి రైతు బీమా పథకంపై వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రైతు బీమా పథకంపై రైతుల్లో నెలకొన్న ఆందోళనను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.రైతు కుటుంబాలకు ఎంతో భరోసాగా ఉన్న రైతు బీమా పథకాన్ని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలని, రైతుల్లో నెలకొన్న అనుమానాలు మరియు ఆందోళనలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.రైతు కుటుంబంలో ప్రధాన ఆధారమైన వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణించినప్పుడు ఆ కుటుంబానికి రైతు బీమా ఎంతో అండగా నిలుస్తుందని, ఈ పథకం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని హింగే భాస్కర్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కోరారు.“రైతు బీమా అనేది రైతు కుటుంబాలకు కేవలం ఒక పథకం కాదు.. ఆపద సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలిచే రక్షణ కవచం. కాబట్టి రైతుల ఆందోళనను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, రైతు బీమాను కొనసాగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలి” అని ఆయన కోరారు.రైతుల సమస్యను ముఖ్యమంత్రి, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతు బీమాపై స్పష్టత కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని తెలంగాణ రైతు రక్షణ సమితి తరఫున కోరారు.

🌐 Select Language:
📰 ePaper