బిచ్కుంద ప్రభుత్వ ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీ
బిచ్కుంద ఆగస్టు 29 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద ప్రభుత్వ ఐటీఐ, ATCలు, ప్రైవేట్ ఐటీఐలలో 2026-27 విద్యా సంవత్సరానికి 3వ దశ వాక్-ఇన్ అడ్మిషన్లు జరుగుతున్నట్లు కన్వీనర్ జి.ప్రమోద్ కుమార్ తెలిపారు.10వ, 8వ తరగతి ఉత్తీర్ణులైన 14 ఏళ్లు పైబడిన అభ్యర్థులు iti.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5 ఉ. 11 గంటల లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.ఖాళీ సీట్లను మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పారు