మెట్పల్లి–నిర్మల్ బస్సు సర్వీస్ పునరుద్ధరణకు విజ్ఞప్తి

August 31, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ఆగస్టు 31: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలం: మెట్పల్లి నుంచి ఏర్గట్ల, తాళ్ల రాంపూర్, తడపాకల్ , బట్టాపూర్ గ్రామాల మీదుగా నిర్మల్ వరకు గతంలో ఉన్న బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ మెట్‌పల్లి ఆర్టీసీ డిపో మేనేజర్ హరి సార్‌ను కలిసి గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెట్పల్లి నుంచి నిర్మల్ వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, వృద్ధులు నిర్మల్, మెట్పల్లి పట్టణాలకు రాకపోకలు సాగించేందుకు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. గతంలో నడిచిన బస్సు సర్వీసును తిరిగి ప్రారంభిస్తే పరిసర గ్రామాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ హరి హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూషణవేణి ప్రవీణ్ యాదవ్, ఉపసర్పంచ్ మూడ్ దయానంద్, వి.డి.సి. అధ్యక్షుడు వేణు గౌడ్, వి.డి.సి. క్యాసిఆర్ బుచ్చ యాదవ్ (చిన్న నర్సయ్య యాదవ్), వి.డి.సి. సభ్యుడు గద్దల ముత్తేన్న, తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper