వైజాగ్ లో అమరజీవి కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ
జనం న్యూస్ ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు వైజాగ్ లో మాజీ గవర్నర్ మరియు మాజీ ముఖ్యమంత్రి అమరజీవి కొణిజేటి రోశయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్లు కొత్తకొండ బాబు మరియు కంకటాల రామం హాజరయ్యారు.కొణిజేటి రోశయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పరిపాలనా దక్షత, ప్రజాసేవలో ఆయన అందించిన కృషి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్గదర్శకమని కొనియాడారు.తెలుగు ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, యువత ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.