70వ ఎస్ జీ ఎఫ్ ఐ మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించిన ఏ సి పి సతీష్ బాబు
జనం న్యూస్ సెప్టెంబర్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం 70వ ఎస్ జీ ఎఫ్ ఐ మండల స్థాయి అండర్-14, అండర్-17 సంవత్సరాల బాలబాలికల ఖో-ఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు మండలం లోని నేరేడు పల్లి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పరకాల ఏ సి పి చిర్ర సతీష్ బాబు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.పోలీస్ శాఖ వారి సహకారంతో, ఎస్సై జక్కుల పరమేశ్వర్ చొరవతో ట్రస్ట్ సభ్యులు ముందుకు వచ్చి 150 మంది క్రీడాకారులకు క్రీడా యూనిఫామ్‌లను అందజేశారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఎస్ జీ ఎఫ్ ఐ కార్యదర్శి వాసుదేవరావు ఎస్ జీ ఎఫ్ యు /19 కార్యదర్శి ఎన్ శ్రీధర్ ప్రధానోపాధ్యాయురాలు మాధవి , ఎస్ జీ ఎఫ్ ఐ మండల కార్యదర్శి సి ఎచ్. తరంగిణి , డాక్టర్ రాము (పి డి), పి ఈ టీ ఎస్ & పి డి ఎస్ రాజినీకాంత్ జ్యోతి సంగీత , సతీష్ పాల్గొన్నారు.ఈ మండల స్థాయి ఎస్ జీ ఎఫ్ క్రీడా పోటీలలో మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 350 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఏ సి పి సతీష్ బాబు మాట్లాడుతూమండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికైన క్రీడాకారులు 17-09-2026 18-09-2026 తేదీలలో నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలలో పాల్గొననున్నారు.క్రీడాకారులకు నిర్వాహకులు, ఉపాధ్యాయులు పోలీస్ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు…..