శక్తి పరిధి నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ లను తొలగించాలి
జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలి
నాగార్జునసాగర్ లో విద్యార్థుల వినూత్న నిరసన
జనం న్యూస్-సెప్టెంబర్ 9- నాగార్జునసాగర్ టౌన్-తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 97 వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి నుంచి పూర్తిగా తొలగించి ప్రస్తుత విద్యా వ్యవస్థలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ నాగార్జునసాగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బోధనా మరియు బోధ నేతల సిబ్బంది వినోద్ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జీవో నెంబర్ 97 ద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను శక్తి విభాగం పరిధిలోకి తీసుకురావడం తో పాటు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తో అనుసంధానం విలియనానికి మార్గం సుఖము అవుతుందని విద్యార్థులు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఈ నిర్ణయం పాలిటెక్నిక్ విద్య యొక్క ప్రస్తుత స్వరూపం విద్యార్థుల ఉన్న విద్యా అవకాశాలు సాంకేతిక విద్యా ప్రమాణాలు సిబ్బంది సేవా అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు, బతుకమ్మ ఆడుతూ సిబ్బంది వినూత్న నిరసన జీవో 97కు వ్యతిరేకంగా మహిళా సిబ్బంది కళాశాల ప్రాంగణంలో బతుకమ్మను నిర్వహిస్తూ నిరసన తెలిపారు బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ సంప్రదాయ బద్దంగా నిరసన వ్యక్తం చేస్తూ సేవ్ పాలిటెక్నిక్ -సేవ్ డిప్లమా ఎడ్యుకేషన్, జీవో 97న రద్దు చేయాలి శక్తి పరిధి నుంచి పాలిటెక్నిక్‌లను తొలగించాలి అంటూ నినాదాలు చేశారు, మానవహారంగా విద్యార్థులు నిరసన, విద్యార్థులు కళాశాల ప్రాంగణంలో భారీగా మానవహారం ఏర్పాటు చేసి జీవో 97 కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు తమ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలను తమతో ఉపాధ్యాయులతో సాంకేతిక విద్యనిపుణులతో సంప్రదించకుండా తీసుకోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, పాలిటెక్నిక్ కళాశాలలను ఇతర వ్యవస్థల్లో విలీనం చేయడం వల్ల భవిష్యత్తులో ఫీజులు విద్యా విధానం కళాశాలల పరిపాలన విద్యార్థులు ప్రయోజనాలు వంటి అంశాలపై అణిచితి ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి -విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి అనే నినాదంతో తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని వారు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు, బోధన సిబ్బంది, బోధననేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.