వివేకానంద లో ముగిసిన ఉపాధ్యాయ దినోత్సవము
జనం న్యూస్:9 సెప్టెంబర్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై. రమేష్ భారత్ నగర్ లోని వేకానంద విద్యాలయములో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ యాళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఒక దీపం తను కరుగుతూ చుట్టూ ఉన్నవారికి వెలుతురునిచ్చేలా, ఉపాధ్యాయులు కూడా తమ జ్ఞానాన్ని పంచి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. సమాజంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. మనకు అక్షరాలను నేర్పడమే కాకుండా, మంచి క్రమశిక్షణను, నైతిక విలువలను నేర్పి మనల్ని ఉత్తమ పౌరులుగా మారుస్తారు. మన జీవితంలో గురువుల స్థానం అమూల్యమైనది. ఇంతటి మహోన్నతమైన ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిఖిత,ఉపాధ్యాయినిలు రత్నమాల, భాగ్యమ్మ, కృష్ణవేణి ఫిర్దోజ్, మానుష అరుణ పాల్గొన్నారు