ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి.
జనం న్యూస్ 09 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ బిఎల్ఓ లు సరైన ప్రణాళికతో విధులు నిర్వహించాలి కుల దృవీకరణ పత్రాలు అవసరమైన వారికి త్వరితగతిన జారీ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం మ్యాపింగ్ కానీ, అనామిలిస్ జాబితాలో ఉన్న వారందరికీ నోటీసుల జారీ, డాక్యుమెంట్స్ అప్లోడ్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.బుధవారం గద్వాలలోని 28, 37వ వార్డులకు సంబంధించి 266, 267, 268, 269 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు నిర్వహిస్తున్న విధులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నోటీసులు అందుకున్న ఓటర్లు నిర్దేశిత తేదీల్లో హియరింగ్ కు హాజరు కానప్పటికీ బిఎల్వోలే వారి ఇంటికి వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లను సేకరించవచ్చన్నారు. ఎన్నికల సిబ్బంది విధుల్లో నిర్లిప్తంగా ఉండడం సరికాదని, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఇప్పటికే అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కొంతమంది అవగాహనరాహిత్యంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిలోలు సరైన ప్రణాళికతో విధులు నిర్వహించాలని, నోటీసులు అందుకున్న వారిలో ఏ, బి, సి కేటగిరీల వారీగా సంబంధిత ఓటర్లతో అవసరమైన డాక్యుమెంట్లను మాత్రమే తీసుకోవాలని, కుల దృవీకరణ పత్రాలు అవసరమైన వారికి రెండు రోజుల్లోనే మంజూరు చేసేలా ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు గల్లంతు కాకుండా తప్పులు లేని, పారదర్శకమైన సమగ్ర ఓటరు జాబితాను రూపొందించాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ను జిల్లాలో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ మధుమోహన్, కౌన్సిలర్లు చంద్రశేఖర్, మంజులరాణి, అదనపు ఏఈఆర్వో సతీష్, సూపర్వైజర్ నాగేంద్రమ్మ, తదితరులున్నారు.జారీ చేయువారు: డీపీఆర్ఓ జోగులాంబ గద్వాల జిల్లా.