‘కలరి పాదం ’లోని కాంబిల్లి కలరి పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరించాలి.

September 10, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా ఎర్నాకుళంలోని ముప్ప తడంలోని కాంబిల్లి శ్రీ ధర్మశాస్తా ఆలయంలో నిర్వహించిన తాంబూల ప్రశ్న సందర్భంగా ప్రముఖ జ్యోతిష్యులు అరయంకావు పుతువమనా హరిదాసన్ నంబూదిరి కీలక విషయాలను వెల్లడించారని ఆలంగాడ్ యోగం పాట్రోన్ సభ్యుడు ఏనుగుల బాలాంజనే యులు తెలిపారు. ముప్పతడం లోని ‘కలరి పాదం ’అనే ప్రదేశంలో ఉన్న కాంబిల్లి కలరికి సంబంధించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయ త్నాలు చేయాలని ఆయన సూచించారని తెలిపారు.ఈ కలరి ఆలంగాడు తంపురాన్ మరియు పండలం రాజ్యానికి సైనిక కమాండర్‌గా సేవలందిం చిన కాంబిల్లి పణిక్కర్కు చెందిన దిగా పేర్కొనబడింది. ఆలంగాడు యోగానికి చెందిన వారసుడు, గౌరవనీయ పెద్ద కాంబిల్లి శంకరన్ వేణుగోపాల్ సమక్షంలో పుతువమనా హరిదాసన్ నంబూదిరి ఆధ్వర్యంలో నిర్వ హించిన తాంబూల ప్రశ్నలో, ప్రస్తుతం ఉన్న సమస్యల పరిష్కారం కోసం శబరిమలలో నెయ్యి దీపం సమర్పణ చేయాలని సూచించారని అన్నారు .ఆలయ ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంతో పాటు కాంబిల్లి కుటుంబం మరియు ఆలంగాడు యోగం శ్రేయస్సు కోసం, జూలై 15వ తేదీలోపు పరిహార క్రతువులు మరియు కలశం కార్యక్రమం నిర్వహించా లని పుతువమనా హరిదాసన్ నంబూదిరి తెలిపారు. కాంబిల్లి కుటుంబం మరియు ఆలంగాడు యోగం రెండూ శ్రీ అయ్యప్ప స్వామివారి పురాణ గాథలో ప్రస్తావించబడినవిగా భావిస్తారు. ఈ తాంబూల ప్రశ్న కార్యక్రమం లో విష్ణు నంబూదిరి మరియు ఆలయ తంత్రిగా ఉన్న కున్నుం పరంబత్ హవీష్ పరమేశ్వరన్ నంబూదిరి,ఆలయ పోషకులు కాంబిల్లి శివశంకరన్ నాయర్ మరియు శివన్‌కుట్టి,అలాగే ఆలంగాడు యోగం ట్రస్ట్ ప్రతి నిధులు మరియు ఆలయ సలహా కమిటీ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు .

🌐 Select Language:
📰 ePaper